"పరివర్తన"
"పరివర్తన"
సనాతన భారతీయ సంస్కృతి సాంప్రదాయల్లో ఆత్మశుద్ధికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రకృతితో సామరస్యంగా మెలగడమే కాకుందా ఆలొచనల్లో,ఆచరణ పరంగా నిర్మలంగా ఉంటేనే వ్యక్తి మోక్షం సాధించగలడని మన శాస్త్రాలు ఉద్ఘోశిస్తున్నాయి. కాని ఇంట్లోని చెత్తనంతా బయట పారబోస్తున్నారు. దాంతో మన చుట్టు పక్కల చెత్తకుప్పలు కొండల్లా పేరుకుపోతున్నాయి. కాలువలు నదులూ కాలుష్య కాసారాలు అవుతున్నాయి. మురికి కాలువలు మూసుకుపోతున్నాయి.జల వాయు కాలుష్యాలు పెరిగిపొతున్నాయి. చెట్లు కూల్చేస్తున్నారు, అడవులు అంతం చేస్తున్నారు.
ఆత్మశుద్ధి సాధించాలంటే జీవన విధానము పరిశుద్దంగా ఉండాలన్న భావనకు ఇది ఎంత మాత్రమూ తగినవిధంగా లేదు.
ప్రజల ఆలోచనా విధానం, కార్యాచరనలో మార్పు మారుతుంతేవడం ద్వారా ఆత్మకు ప్రకృతికి మధ్య మళ్ళీ అనుసంధానం ఎర్పరచగలగాలి. దీనికి మానసిక, సామాజిక, ఆర్ధిక కోణాలు ఉన్నాయి. దీని ప్రభావం ఫలితంగా వ్యక్తుల ప్రవర్తన మారుతుంది. అది సమ్మిళిత అభివృద్ధికి బాత వేస్తుంది. ఈ ప్రయాణంలో ముందుగా బహిరంగ మలవిసర్జణను నివారించాల్సి ఉంటుంది. ఘన, ద్రవ వ్యర్ధాల నిర్వహణ సమర్ధంగా చేపట్టాల్సి ఉంటుంది. కల సాకారానికి ఇవి రెండూ ఎంతో కీలకమైనవి. వీటిలో మొదతిది గ్రామీణ పట్టణ ప్రాంతాలు రెండిటినీ కలవరపెడుథుంటే, రెండో అంశం ప్రధానంగా పట్టాణాలను ఆందోళనకు గురిచేస్తోంది. పారిశుధ్య లోపం ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. వ్యాధి భాదలు పెరిగి ముఖ్యంగా పేదలు ఆర్ధిక భారంతో కుంగిపోతున్నారు. పరిశుద్ధ నగరాలతో పాటు బహిరంగ మల విసర్జనకు తావు లేని సమాజాన్ని సృష్టించడము తక్షణావసరము. వ్యక్తుల్లో మరుగుదొడ్లను ఉపయోగించే అలవాటును పెంపొందించాల్సి ఉంది. చెత్తా చెదారాన్ని బహిరంగ ప్రదేశాల్లో విసరకుండా చూడాలి. ఘన వ్యర్ధాల్ని వేరు చేసె మెళకువలు నేర్పాలి. ఆహారం తీసుకునే ముందు చేతులు కడుక్కొవడం, నివ్వస స్థలాలు, పని ప్రదేశాలు, బహిరంగ స్తలాలను పరిశుద్ధంగా ఉంచడం. పార్కుల నిర్వహణలో సామజిక భాగస్వామ్యాన్ని పెంపొందించడం. ఇలాంటి ప్రవర్తనాపరమైన పరివర్తనే మన సమాజ విజయానికి కీలకం.

Comments
Post a Comment