"పరివర్తన"
"పరివర్తన" సనాతన భారతీయ సంస్కృతి సాంప్రదాయల్లో ఆత్మశుద్ధికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ప్రకృతితో సామరస్యంగా మెలగడమే కాకుందా ఆలొచనల్లో,ఆచరణ పరంగా నిర్మలంగా ఉంటేనే వ్యక్తి మోక్షం సాధించగలడని మన శాస్త్రాలు ఉద్ఘోశిస్తున్నాయి. కాని ఇంట్లోని చెత్తనంతా బయట పారబోస్తున్నారు. దాంతో మన చుట్టు పక్కల చెత్తకుప్పలు కొండల్లా పేరుకుపోతున్నాయి. కాలువలు నదులూ కాలుష్య కాసారాలు అవుతున్నాయి. మురికి కాలువలు మూసుకుపోతున్నాయి.జల వాయు కాలుష్యాలు పెరిగిపొతున్నాయి. చెట్లు కూల్చేస్తున్నారు, అడవులు అంతం చేస్తున్నారు. ఆత్మశుద్ధి సాధించాలంటే జీవన విధానము పరిశుద్దంగా ఉండాలన్న భావనకు ఇది ఎంత మాత్రమూ తగినవిధంగా లేదు. ప్రజల ఆలోచనా విధానం, కార్యాచరనలో మార్పు మారుతుంతేవడం ద్వారా ఆత్మకు ప్రకృతికి మధ్య మళ్ళీ అనుసంధానం ఎర్పరచగలగాలి. దీనిక...