Posts

"పే బ్యాక్ టు సొసైటి"

Image
సమాజంలో నేడు ప్రతి మనిషి వారి వారి స్థాయిల్లో, హొదాల్లో,పరిస్థితుల్లో ఒత్తిడికి గురవుతూ అనారోగ్య పోటీ ప్రపంచంలొ జీవించడం మరచి, బ్రతికేస్తున్నారు. ఈ క్రమంలో ఎంత సంపాదించిన ఏమి సాధించినా,  ఇంకా ఏదో చెయ్యాలని, ఏదో పొందాలని మనశ్శాంతి లేకుండా సంతృప్తి లేని జీవితాన్ని ఏదో తెలియని అలజడిలో, గందరగోల పరిస్థితుల్లో యాంత్రిక జీవనాన్ని కొనసాగిస్తున్నారు. ఈ రకమైన ప్రకృతి వ్యతిరేక గమనం నుంచి జీవితంలో ఏదొక సంధర్బంలోనైనా బయటపడాలని ఆశిస్తూ, ఆత్మ సంతృప్తి కోసం నిజమైన ఆనందానిచ్చే సమాజ సేవలో పాలుపంచ్కోవాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటూ ఉంటారు.  ఈ సేవ ఎక్కడ ప్రారంభించాలి, ఏక్కద ఎవరికి సేవలు అందించాలి దాని ఫలితం ఎలా ఉండాలి, తదితర ఆలోచనల్లోనే కొందరికి జీవితంలో అన్నీ ఉన్నా వారి జీవితం ఏమి చెయ్యకుండానే ముగుస్తుంది. అటువంటి వారు ఒడిఒడిగా తన జీవిత ప్రస్థానం ప్రారంభమైన ప్రాంతం లొని పరిస్థుతల నుంచి ప్రపంచం నేడు ఎదుర్కొంటున్న ఉమ్మడి సవాలు వరకు నిశితంగా అలోచించాలి. ఇవాళ అలాంటి ఒక సంక్లిష్ట సవాలు ఆహార భధ్రత. ఆకలి చావులు ఏటా ప్రపంచంలొ ఒక కోటీ ఇరవై లక్షలని ప్రపంచ సూచీలు తెలియజేస్తున్నాయి. రాబోయే దశాబ్ద కాలంలో ...